ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు
ABN , Publish Date - Mar 07 , 2026 | 01:04 AM
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు శశిధర్, కార్యదర్శి సంజయ్, విద్యార్థులు సీఎం చంద్రబాబుకు పోస్టు కార్డులు పంపించారు.
ఆదోని అగ్రికల్చర్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు శశిధర్, కార్యదర్శి సంజయ్, విద్యార్థులు సీఎం చంద్రబాబుకు పోస్టు కార్డులు పంపించారు. పట్టణంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ఎస్సీ బాయ్స్ హాస్టల్, ఎస్సీ కళాశాల బాయ్స్ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు రాజు, జగన్, మహేశ్, వీరన్న, శీను పాల్గొన్నారు.