Share News

ఉపాధి లేక వలసబాట

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:37 PM

వ్యవసాయ పనులు తగ్గిపోవడం అధికారులు ఎలాంటి ఉపాధి పనులు కల్పించకపోవడంతో వలస కూలీలు బెంగళూరు, గుంటూరుకు మంగళవారం రాత్రి ఒక్కరోజే మండలం నుంచి సుమారు 200 కుటుంబాలు వలస వెళ్లాయి.

ఉపాధి లేక వలసబాట
పొదలకుంటలో వలస వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు

కౌతాళం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ పనులు తగ్గిపోవడం అధికారులు ఎలాంటి ఉపాధి పనులు కల్పించకపోవడంతో వలస కూలీలు బెంగళూరు, గుంటూరుకు మంగళవారం రాత్రి ఒక్కరోజే మండలం నుంచి సుమారు 200 కుటుంబాలు వలస వెళ్లాయి. మండలంలోని మదిరె, పొదలకుంట, వల్లూరు గ్రామాల నుంచి కుటుంబాలతో పాటు చదువుకుంటున్న పిల్లలను కూలీలు తమ వెంట తీసుకెళ్లారు. మారెయ్య, రాములు మాట్లాడుతూ గ్రామంలో వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో జీవనం కొనసాగడం కష్టంగా మారిందని చెప్పారు. తెలంగాణలో మిరప పంట కోతలు మొదలయ్యాయని, దీంతో పిల్లలను తీసుకుని వలస పోతున్నామని తెలిపారు. అలాగే రమేశ్‌ అనే రైతు మాట్లాడుతూ తాము వ్యవసాయంలో ఈ ఏడాది అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, పెట్టుబడి కోసం అప్పులు చేశామని అప్పులు తీర్చుకునేందుకు గుంటూరుకు కుటుంబంతో కలిసి మూటలు సర్దుకుపోతు న్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jan 21 , 2026 | 11:37 PM