జోరుగా వరినాట్లు
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:13 AM
మండలంలోని కోల్‌మాన్ పేట, దుద్ది, కందుకూరు తదితర గ్రామాల్లో రబీ సీజన్‌లో బోరుబావుల కింద రైతులు జోరుగా, హుషారుగా వరినాట్లు వేస్తున్నారు.
కోసిగి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని కోల్‌మాన్ పేట, దుద్ది, కందుకూరు తదితర గ్రామాల్లో రబీ సీజన్‌లో బోరుబావుల కింద రైతులు జోరుగా, హుషారుగా వరినాట్లు వేస్తున్నారు. అయితే తుంగభద్ర నది తీరంలో ఈ ఏడాది తుంగభద్ర డ్యాం గేట్ల రిపేరీ వల్ల వరినాట్లు లేకపోవడంతో నది తీర ప్రాంతంలో రైతులు వరినాట్లు లేక పొలాలు వెలవెలబోతున్నాయి. అయితే బోరుబావుల కింద మండలంలోని పలు గ్రామాల్లో రైతులు బోరుబావుల కింద వరినాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది వరికి అధిక ధర ఉండటంతో బోరు బావుల కింద రైతులు పెద్ద ఎత్తున వరి సాగుపై ఆసక్తి చూపుతున్నారు.