Share News

జోరుగా వరినాట్లు

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:04 AM

గోనెగండ్లతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వరి రైతులు తమ వ్యవసాయ పొలాల దగ్గర వరినాట్లు వేస్తున్నారు.

జోరుగా వరినాట్లు
వేముగోడులో వరినాట్లు వేస్తున్న కూలీలు

గోనెగండ్ల, జనవరి 10(ఆంధ్రజ్యోతి): గోనెగండ్లతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వరి రైతులు తమ వ్యవసాయ పొలాల దగ్గర వరినాట్లు వేస్తున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు కింద పంట పొలాలలో వరి నాట్లు అరకొరగా సాగుతున్నాయి. మండల వ్యాప్తంగా దాదాపు 400 ఎకరాలు వరి నాట్లు వేస్తున్నారు. రైతులు బావులు, బోర్ల దగ్గర వరి నాట్లను వేస్తున్నారు. అలాగే గాజులదిన్నె ప్రాజెక్ట్‌ ఎగువ, దిగువ ప్రాంతలలో వరి నాట్ల వేస్తున్నారు. సోనా మసూరి, జిలకర సోనా, 65 డీపీ, తెల్ల హంస, కర్నూలు సోనా, రకాలను సాగు చేస్తున్నారు. పత్తి, వేరుశనగ, పంటను తీసివేసి వరిని సాగు చేస్తున్నారు. గాజులదిన్నె, ఐరన్‌బండ, హెచ్‌ కైరవాడి, వేముగోడు, పుట్టపాశం, పెద్దనేలటూరు, ఎన్నెకండ్ల, గోనెగండ్ల గ్రామాల్లో వరి సాగు చేస్తున్నారు.

Updated Date - Jan 11 , 2026 | 12:04 AM