చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:29 AM
యువత దేశ భవిష్యత్తుకు పునాదులు అని, చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టాలని సెట్కూరు సీఈవో వేణుగోపాల్ సూచించారు.
కర్నూలు ఎడ్యుకేషన్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): యువత దేశ భవిష్యత్తుకు పునాదులు అని, చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టాలని సెట్కూరు సీఈవో వేణుగోపాల్ సూచించారు. నగరంలోని బి.క్యాంపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ‘డ్రగ్స్ వద్దు బ్రో - చదువు ముద్దు బ్రో’ అవగాహన కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.నాగస్వామి నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ఈగల్ టీమ్ సభ్యులు వై.ఎల్లిసా, మాసూంవలి, రమేష్, అధ్యాపకులు మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
]