Share News

ప్రమాదాలను మనోధైర్యంతో ఎదుర్కోవాలి

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:33 PM

అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు మనోధైర్యంతో ఎదుర్కోవాలని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి శంకర ప్రసాద్‌ సూచించారు.

ప్రమాదాలను మనోధైర్యంతో ఎదుర్కోవాలి
అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

మహానంది, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు మనోధైర్యంతో ఎదుర్కోవాలని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి శంకర ప్రసాద్‌ సూచించారు. బుధవారం మహానంది క్షేత్రంలో ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అగ్ని మాపక శాఖ, పోలీస్‌ శాఖలు సంయుక్తంగా భక్తులకు ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదాలతో పాటు ఇతర ఘటనలు జరిగినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన ప్రతి చర్యలపై అవగాహన కల్పించారు. ప్రధానంగా పుణ్య క్షేత్రాల్లో భక్తుల రద్దీ సమయంలో తోపులాటలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వ్యవహరించాల్సిన పలు అంశాలపై వివరించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రఘునాఽథ్‌, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, ఏఈఓ మధు, ఎస్‌ఐ శివాంజల్‌, వైద్యాధికారి భగవాన్‌దాస్‌, ఎంపీహెచ్‌ఈవో ఉసేన్‌రెడ్డి, పర్యవేక్షకుడు నీలకంఠరాజు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:33 PM