కామేశ్వరీదేవికి బంగారు కళ్లు బహూకరణ
ABN , Publish Date - Oct 20 , 2026 | 12:28 AM
మహానంది క్షేత్రంలోని కామేశ్వరీదేవికి హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస సుధాకర్, మీనాక్షి సుబ్బలక్ష్మి దంపతులు బంగారు కళ్లను అందజేసినట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మహానంది, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలోని కామేశ్వరీదేవికి హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస సుధాకర్, మీనాక్షి సుబ్బలక్ష్మి దంపతులు బంగారు కళ్లను అందజేసినట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆలయ ప్రాంగణంలోని యాగశాల మంటపంలో దాతలు రూ.1,50 లక్షల విలువ గల ఒక తులం బంగారంతో చెయ్యించిన కళ్లను ఈవోకు అందజేశారు. ఏఈవో మధు, వేదపండితుడు రవిశంకర్ అవధాని పాల్గొన్నారు.