Share News

ఆలయానికి ఉత్సవ గొడుగుల సమర్పణ

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:30 AM

బేతంచెర్ల పట్టణంలోని గౌరీపేటలో ఆంజనేయ స్వామి ఆలయంలో వెలిసిన చెన్నకేశవ స్వామి, చౌడేశ్వరి మాత ఆలయానికి రూ 50వేలు విలువ చేసే ఉత్సవ గొడుగులను దాతలు సమర్పించారని ఆలయ చైర్మన్‌ మారుతి శర్మ తెలిపారు.

ఆలయానికి ఉత్సవ గొడుగుల సమర్పణ
గొడుగులు అందజేసిన దాతలు

బేతంచెర్ల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): బేతంచెర్ల పట్టణంలోని గౌరీపేటలో ఆంజనేయ స్వామి ఆలయంలో వెలిసిన చెన్నకేశవ స్వామి, చౌడేశ్వరి మాత ఆలయానికి రూ 50వేలు విలువ చేసే ఉత్సవ గొడుగులను దాతలు సమర్పించారని ఆలయ చైర్మన్‌ మారుతి శర్మ తెలిపారు. గురువారం పట్టణానికి చెందిన శేషాచార్యుల కొడుకులు శ్రీనివాస్‌, కృష్ణమోహన్‌, శ్రీరామ్‌ ఉత్సవ గొడుగులను బహుకరించారని పేర్కొన్నారు. దాతలను సుజాత శర్మ, హుస్సేన్‌ రెడ్డి అభినందించారు.

Updated Date - Mar 13 , 2026 | 12:30 AM