ప్రజల ఆరోగ్యానికి ఎన్టీఆర్ కుటుంబం అంకితం
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:11 AM
దివంగత నందమూరి తారక రామారావు కుటుంబం ప్రజల ఆరోగ్య రక్షణకు అంకితమైందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.
ఎమ్మిగనూరు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): దివంగత నందమూరి తారక రామారావు కుటుంబం ప్రజల ఆరోగ్య రక్షణకు అంకితమైందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. పట్టణంలోని శిల్పా ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ ఆవరణలో బుధవారం హైదరాబద్‌లోని బసవతారకం ఇండో, అమెరికా ఆసుపత్రి ఆద్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిభిరానికి వచ్చిన వందమందికి పైగా మెబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన మెమో గ్రామ్, అల్ర్టా సౌండ్, ఎక్స్‌రే పరీక్షలు చేశారు. ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ పేదలు ఖరీదైన వైద్య పరిక్షలు చేయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో బసవతారకం ఆసుపత్రి నిర్వాహకులు నందమూరి బాలకృష్ణ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ఎమ్మిగనూరులో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురువారం నందవరం, గోనెగండ్ల మండలాల ప్రజలు ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బసవతారం ఆసుపత్రి మేనేజర్ లక్ష్మణ్, డా.రేణుక, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ మల్లయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంబీ మహేష్, నాయకులు కమ్మ మహేంద్రబాబు, రంగస్వామి గౌడ్, కలీముల్లా, కుర్ణి కార్పొరేషన్ చైర్మన్ మిన్నప్ప, నవాజ్ పాల్గొన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో బుదవారం ఆయుస్మాన్ ఆరోగ్య భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి భూమి చేశారు. ఆయుస్మాన్ ఆరోగ్య మెడికల్ ఆఫీసర్ డా వై స్వర్ణలత, యునాని మెడికల్ ఆఫీసర్ డా.ఉమామహేశ్వరి, డా.లక్ష్మి మోనాలీసా, నర్సింగ్ సూపరింటెండెంట్ శకుంతల తదితరులు పాల్గొన్నారు.