భక్తిశ్రద్ధలతో నిర్జల ఏకాదశి పూజలు
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:27 AM
పాతనగరంలో జమ్మిచెట్టు సమీపంలోని శ్రీలలితా పీఠంలో గురువారం నిర్జల ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
కర్నూలు కల్చరల్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): పాతనగరంలో జమ్మిచెట్టు సమీపంలోని శ్రీలలితా పీఠంలో గురువారం నిర్జల ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. వన్‌టౌన్‌లోని గోదా విష్ణుచిత్త భక్తబృందం ఆధ్వర్యంలోవేంకటేశ్వర స్వామి, గోదాదేవి అమ్మవార్లకు పంచామృతాభిషేకం, సుగంధ ద్రవ్యాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం చేపట్టారు. వెయ్యి లడ్డూలు, వెయ్యి వడలతో విశేష అర్చన నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదాలు, అల్పాహారం పంపిణీ చేశారు. పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి తదితరులు పాల్గొన్నారు.