కనీస సౌకర్యాలు కల్పించాలి: సీపీఎం
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:22 PM
టిడ్కో గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, కార్యవర్గ సభ్యుడు రాధాకృష్ణ, పట్టణ కార్యదర్శి గోవిందు కోరారు.
ఎమ్మిగనూరు టౌన్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): టిడ్కో గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, కార్యవర్గ సభ్యుడు రాధాకృష్ణ, పట్టణ కార్యదర్శి గోవిందు కోరారు. ఆదివారం టిడ్కో ఇళ్లను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు టిడ్కో ఇళ్లను నిర్మించారని, అయితే ఇప్పటి వరకు వాటిని లబ్దిధారులకు అందజేయకుండా కాలయాపనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మిగనూరులోని శివన్న నగర్‌లో నిర్మించిన టిడ్కో గృహాలకు తాగునీటి, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, దుకాణ సముదాయం వంటి కనీస సౌకర్యాలు ఇప్పటి వరకు కల్పించకపొవడం దురదృష్టకరమని అన్నారు. గత ప్రభుత్వం మసి పూసి మారడకాయలాగా రంగులు వేసి వదిలేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలోనూ సౌకర్యాలు కల్పించకుండా సంక్రాతి కానుక అని చెప్పి ఒకటి రెండు బ్లాక్‌లను మాత్రమే లబ్ధిదారులకు అండజేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో రాముడు, లక్ష్మీ నరసయ్య, రమేశ్, సురేశ్ పాల్గొన్నారు.