Share News

ఉపాధి లేక వలసబాట

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:44 PM

వ్యవసాయ పనులు తగ్గిపోవడం అధికారులు ఎలాంటి ఉపాధి పనులు కల్పించకపోవడంతో కూలీలు బెంగళూరు, గుంటూరుకు గురువారం ఒక్కరోజే హొళగుంద మండలం నుంచి సుమారు 100 కుటుంబాలు వలస వెళ్లాయి.

ఉపాధి లేక వలసబాట
నేరణికి తండా నుంచి వలస వెళ్లడానికి సిద్ధంగా ఉన్న కూలీలు

హొళగుంద, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ పనులు తగ్గిపోవడం అధికారులు ఎలాంటి ఉపాధి పనులు కల్పించకపోవడంతో కూలీలు బెంగళూరు, గుంటూరుకు గురువారం ఒక్కరోజే హొళగుంద మండలం నుంచి సుమారు 100 కుటుంబాలు వలస వెళ్లాయి. మండలంలోని నేరణికి, నేరణికి తాండ కొత్తపేట గ్రామాల నుంచి కుటుంబాలతో పాటు చదువుకుంటున్న పిల్లలను తమ వెంట తీసుకెళ్లారు. నేరణికి తండా వాసులు మాట్లాడుతూ గ్రామంలో వ్యవ సాయ పనులు తగ్గిపోవడంతో జీవనం కొనసాగడం కష్టంగా మారిందని చెప్పారు. తెలంగాణలో మిరప పంట కోతలు మొదలయ్యాయని, దీంతో పిల్లలను తీసుకుని వలస పోతున్నామని తెలిపారు. ఈ విషయంపై ఏపీవో తిమ్మారెడ్డి ని వివరణ కోరగా ఉపాధి పనులు కల్పించి, వలసలు లేకుండా చూస్తామన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:44 PM