Share News

మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ ఉండాలి: డీఈవో

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:38 PM

మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలని డీఈవో సుధాకర్‌ సూచించారు.

మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ ఉండాలి: డీఈవో
మాట్లాడుతున్న డీఈవో సుధాకర్‌

ఆలూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలని డీఈవో సుధాకర్‌ సూచించారు. ఆలూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం నుంచి వస్తున్న ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌పై శనివారం తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందిస్తుంటే ప్రభుత్వం నుంచి వస్తున్న అభిప్రాయ సేకరణలో చాలామంది అవగాహనరాహిత్యం వల్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాధానాలు వస్తున్నాయని తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని పర్యవేక్షించి సరైన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కోరారు. సమావేశంలో ఎంఈవోలు కోమలాదేవి, చిరంజీవిరెడ్డి, మిడ్‌ డే మీల్స్‌ ఏడీ భూషణం, హెచ్‌ఎం సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:38 PM