‘నేనూ నా బడి పిల్లలు’ పుస్తకావిష్కరణ
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:56 PM
కర్నూలుకు చెందిన కథా రచయిత ఎస్‌ఎండీ ఇనాయతుల్లా రాసిన ‘నేనూ నా బడి పిల్లలు’ పుస్తకాన్ని ఆదివారం సాయత్రం నగరంలోని ఎ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాల ఆవరణలో ఆవిష్కరించారు.
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): కర్నూలుకు చెందిన కథా రచయిత ఎస్‌ఎండీ ఇనాయతుల్లా రాసిన ‘నేనూ నా బడి పిల్లలు’ పుస్తకాన్ని ఆదివారం సాయత్రం నగరంలోని ఎ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాల ఆవరణలో ఆవిష్కరించారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తి ఓబులయ్య అధ్యక్షత జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ సభలో, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత కేఎన్‌వీ రాజశేఖర్, వావిలాల విద్యాసంస్థల అధినేత వావిలాల కృష్ణమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ కథా రచయిత ఇనాయతుల్లా తన నలభై ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో పాఠశాలల బాలలతో తనకు ఉన్న అనుబంధానికి ప్రతీకగా ఈ పుస్తకం నిలుస్తుందని కొనియాడారు. సభలో ఆత్మీయ అతిథులుగా ప్రతిభ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎం. అరుణాచలం రెడ్డి, పగిడ్యాల మండల విద్యాధికారి సుభాన్, విశ్రాంత ఎంఈవో మౌలాలి తదితరులు ప్రసంగించారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. కథా రచయిత మారుతి పౌరోహితం పుస్తక సమీక్ష చేశారు. అనంతరం పుస్తక రచయిత ఎస్‌ఎండీ ఇనాయతుల్లాను ఘనంగా సత్కరించారు.