Share News

యాజమాన్య పద్ధతులు పాటించాలి

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:38 AM

ఎల్‌నినో ప్రభావం కారణంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటించి లాభసాటి దిగుబడులు పొందాలని జిల్లా వ్యవసాయ అధికారులు వెంకటేశ్వర్లు, అధికారి గంగాధర్‌ రైతులకు సూచించారు.

యాజమాన్య పద్ధతులు పాటించాలి
అలగనూరులో మాట్లాడుతున్న డీఏవో వెంకటేశ్వర్లు

మిడుతూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం కారణంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటించి లాభసాటి దిగుబడులు పొందాలని జిల్లా వ్యవసాయ అధికారులు వెంకటేశ్వర్లు, అధికారి గంగాధర్‌ రైతులకు సూచించారు. అలగనూరులో బుధవారం ఆర్‌పీఎల్‌పై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నంద్యాల వ్యవసాయ పరిశోధన స్ధానం నుంచి శాస్త్రవేత్తలు మంజునాథ్‌, రవిప్రకాశ్‌ రెడ్డి, సతీష్‌ గౌడు, ఏవో పీరునాయక్‌, వ్యవసాయ సిబ్బంది పాలొన్నారు.

గడివేముల: వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. గ్రంధివేముల రైతులకు ప్రత్యామ్నామ పంటల సాగు, పంట బీమాపై అవగాహన కల్పించారు. అధికారి గంగాధర్‌, శాస్త్రవేత్తలు మంజునాఽథ్‌, ప్రకాష్‌ రెడ్డి, సతీష్‌ బాబు, మండల వ్యవసాయాధికారి పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:38 AM