Share News

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:32 AM

ఈనెల 11న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని నందికొట్కూరు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శోభారాణి, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి దివ్య పిలుపునిచ్చారు.

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శోభారాణి

నందికొట్కూరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఈనెల 11న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని నందికొట్కూరు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శోభారాణి, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి దివ్య పిలుపునిచ్చారు. నందికొట్కూరు కోర్టు ఆవరణలో బుధవారం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. న్యాయాధికారులు మాట్లాడుతూ రాజీ అయ్యే క్రిమినల్‌ తగాదాలలో ఇరుపక్షాలతో మాట్లాడి రాజీ అయ్యే విధంగా కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాజీ అయ్యే ఇరుపక్షాల కోసం ముందస్తు లోక్‌ అదాలత్‌ బెంచులను ఏర్పాటు చేశామన్నారు. నందికొట్కూరు పరిసర ప్రాంతాలలోని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నందికొట్కూరు రూరల్‌ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 12:32 AM