మహాసభలను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:42 AM
ఈ నెల 28,29 తేదీలలో ఆలూరులో జరిగే 21వ ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
కర్నూలు న్యూసిటీ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఈ నెల 28,29 తేదీలలో ఆలూరులో జరిగే 21వ ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో శుక్రవారం మహాసభల కరపత్రం విడుదల చేశారు. జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప మాట్లాడుతూ 28న ఆలూరులో వేలాది మందితో ప్రదర్శన బహిరంగ సభ, 29న 200 మంది కార్మిక సంఘాల నాయకులతో ప్రతి జిల్లా సభ ఉంటుందని తెలిపారు. మహాసభల ఆహ్వన సంఘం అధ్యక్షుడు బి.గిడ్డయ్య, ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు జి.చంద్రశేఖర్, బి.వెంకటేష్, హోటల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పురుషోత్తం, టి.రామాంజనేయులు పాల్గొన్నారు.