Share News

విజయవంతం చేయండి

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:59 PM

ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించే మార్చ్‌ టు పార్లమెంటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడివన్న పిలుపునిచ్చారు.

విజయవంతం చేయండి
మాట్లాడుతున్న ఎస్టీయూ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు అడివన్న

ఎమ్మిగనూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించే మార్చ్‌ టు పార్లమెంటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడివన్న పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎస్టీయూ కార్యలయంలో శనివారం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2010కి ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలన్నారు. జాతీయ విద్య విధానాన్ని సవరించి ఎస్‌సీఈఆర్‌టీని అమలు చేయాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఐఆర్‌ 30శాతం ఫిట్మెంట్‌తో పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్‌ బసవరాజు, వెంకటేశ్వర్లు, రామచంద్ర, యల్లప్ప, బాబయ్య, ప్రసన్నరాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 11:59 PM