పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్
ABN , Publish Date - Jun 20 , 2026 | 01:04 AM
సీఎం చంద్ర బాబు నాయుడు ఈనెల 24న జియో మైసూరు గోల్డ్ మైన్స్ కంపెనీ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
తుగ్గలి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్ర బాబు నాయుడు ఈనెల 24న జియో మైసూరు గోల్డ్ మైన్స్ కంపెనీ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జొన్నగిరి శివా రులో ఉన్న జియో మైసూరు గోల్డ్ మైన్స్ కంపెనీని ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ నూరుల్ ఖమర్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలిసి పరిశీలించారు. హెలి ప్యాడ్‌తో పాటు, ఫ్యాక్టరీకి వెళ్లే రహదారితో పాటు బహి రంగ సభ ప్రాంగణాన్ని కూడా తనిఖీ చేశారు. గ్రంథా లయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, డీఆర్వో వెంకట నారాయణమ్మ, ఆర్డీవోలు సందీప్, ఓబులేసు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు మహేశ్వరరెడ్డి, ఆర్‌డబ్లూఎస్‌ఈ మనోహర్, డీపీవో భాస్కర్, వెంకటపతి, తహసీల్దార్ రవి తదితరులు పాల్గొన్నారు.
పటిష్ట భద్రత
సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల మద్య ఉన్న జియో మైసూరు గోల్డ్ మైన్స్ కంపెనీని, పరిసరాలను ఆయన పోలీసు అధికారులు, సిబ్బందితో పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై కంపెనీ యాజమాన్యంతో చర్చిం చారు. పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, సీఐ పులిశేఖర్, ఎస్‌ఐ మల్లికార్జున తదితరులున్నారు.