Share News

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుదాం

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:07 AM

భావితరాలకు ఉన్నత భవిష్యత్‌ ఇచ్చేందుకు ప్లాస్టిక్‌రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతగా తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుదాం
చీపురుతో రోడ్లను శుభ్రం చేస్తున్న రాఘవేంద్రరెడ్డి, నాయకులు

మంత్రాలయం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): భావితరాలకు ఉన్నత భవిష్యత్‌ ఇచ్చేందుకు ప్లాస్టిక్‌రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతగా తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు. శనివారం మంత్రాలయంలో ఎంపీడీవో నూర్జహాన్‌, ఏపీవో భక్తవత్సలం, గ్రామ కార్యదర్శి ఉపేంద్రరెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. చీపురు చేతపట్టి రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు సుందరంగా పరిశుభ్రంగా, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా ప్రతి మూడవ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వచ్ఛతపై దృష్టి సారించి అందరిని భాగస్వాములని చేశారని అన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ తమ కాలనీల్లో పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎస్‌ఎం గోపాల్‌రెడ్డి, టీడీపీ మాజీ అధికార ప్రతినిధి చావడి వెంకటేశ్‌, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, ఎంపీటీసీ మేకల వెంకటేశ్‌, మండల కార్యదర్శి నరసింహ, డీసీ తిమ్మప్ప, మల్లికార్జున, పవన్‌కుమార్‌, రఘు, శివ, విష్ణవర్ధన్‌, సీఐ రామాంజులు, లక్ష్మన్న, సచివాలయం ఉద్యోగులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 12:07 AM