Share News

విద్యార్థులకు ల్యాబ్‌లు అందుబాటులోకి తేవాలి

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:14 AM

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని రాయలసీమ వర్సిటీ ఉపకులపతి వి. వెంకట బసవరావు ఆదేశించారు.

విద్యార్థులకు ల్యాబ్‌లు అందుబాటులోకి తేవాలి
భూమిపూజ చేస్తున్న ఉపకులపతి వెంకట బసవరావు

కర్నూలు అర్బన్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని రాయలసీమ వర్సిటీ ఉపకులపతి వి. వెంకట బసవరావు ఆదేశించారు. రాయలసీమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ కళాశాల కాలేజీకి అనుబంధంగా ల్యాబ్‌ల నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ సివిల్‌, ఇంజనీరింగ్‌ కోర్సులు అభ్యసించే విద్యార్థుల కోసం ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నీటి నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు, ల్యాబుల్లో అవసరమైన పరికరాలు కూడా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కంప్యూటర్‌ సైన్సు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్‌ ్స మొదలైన విభాగాలకు అధునాతన కంప్యూటర్‌ ల్యాబులను ఏర్పాటు చేశామన్నారు. గత నెలలో భూమి పూజ చేసిన ఇంజనీరింగ్‌ కాలేజీ అధనపు భవనాల నిర్మాణం కూడా త్వరితగతిన కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌టీకే నాయక్‌, రిజిష్ట్రార్‌ బి. విజయకుమార్‌ నాయుడు, అధ్యాపకులు, ఇంజనీరింగ్‌ సిబ్బంది, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 12:14 AM