అభివృద్ధి పథంలో కేఎంసీ
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:40 AM
కర్నూలు మెడికల్ కాలేజీని గత రెండేళ్లలో అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్లినట్లు ప్రిన్సిపాల్ డా.కే. చిట్టినరసమ్మ వెల్లడించారు.
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్ కాలేజీని గత రెండేళ్లలో అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్లినట్లు ప్రిన్సిపాల్ డా.కే. చిట్టినరసమ్మ వెల్లడించారు. శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో వైస్ ప్రిన్సిపాల్స్ డా.డి. శ్రీరాములు, డా.బి. విజయానందబాబు, డా. సింథియా శుభప్రధతో కలిసి ప్రిన్సిపాల్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తాను ప్రిన్సిపాల్‌గా 2024 మార్చి 1వ తేదీన బాధ్యతలు స్వీకరించాక రూ.120 కోట్లతో స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభమైందన్నారు. రూ. 5 లక్షల సీడీఎస్ నిధులతో స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు సౌకర్యాలు కల్పించామన్నారు. అలాగే ఈ-హాస్పిటల్ కోసం డీఎంఈ అనుమతితో 10 కంప్యూటర్లు, సీడీఎస్ నిధులతో కొనుగోలు చేశామన్నారు. క్యాన్సర్ ఆసుపత్రిలో 3 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లలో రెండు థియేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 250 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు సరిపడ పరీక్ష హాల్‌ను ఆధునీకరించామని, పరీక్ష కేంద్రాల్లో 10 మంది విద్యార్థులకు సీసీ కెమెరా, మైక్ సౌకర్యాలను అమర్చినట్లు తెలిపారు. తన హయాంలోనే గైనిక్ విభాగానికి 4 పీజీ సీట్లు, మెడిసిన్‌కు 9, ప్లాస్టిక్ సర్జరీకి 4 పీజీ సీట్లు రావడంతో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. రూ. 10 లక్షలతో స్కిల్ ల్యాబ్, పెథాలజీ విభాగంలో రూ.20 కోట్లతో ఎల్‌సీడీలను ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల రీజినల్ ఐ హాస్పిటల్‌కు రూ.25 లక్షలతో ఓసీటీ మిషన్, గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగానికి మ్యానోమెట్రి 20 లక్షలతో పరికరాల కోసం గురువారం టెండర్ల ప్రక్రియ ని ర్వహించినట్లు చెప్పారు. త్వరలో ఎస్‌పీఎం విభాగానికి రూ.40 లక్షలతో కొ త్త బస్సును కొనుగోలు చేయనున్నట్లు పెథాలజీ విభాగంలో ఇమ్యూ హి స్ర్టో కెమిస్ట్ వంటి క్యాన్సర్ పరీక్షలను అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు.