Share News

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ABN , Publish Date - May 23 , 2026 | 12:27 AM

దోమల నివారణతో మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ తదితర ప్రాణాంతక వ్యాధులు దూరమవుతాయని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు సూచించారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
అవగాహన కల్పిస్తున్న జిల్లా మలేరియా అధికారి

శిరివెళ్ల, మే 22(ఆంధ్రజ్యోతి): దోమల నివారణతో మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ తదితర ప్రాణాంతక వ్యాధులు దూరమవుతాయని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు సూచించారు. శిరివెళ్లలో నిర్వహిస్తున్న ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వల వల్ల దోమల లార్వా ఎదుగుదల, ప్రభుత్వ వైద్యశాలల్లో అందించే వైద్య సేవల గురించి ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యుడు ముఖేష్‌, మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి వెంకటేశ్వరరెడ్డి, సీహెచ్‌వో రామ్మోహన్‌రెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 12:27 AM