Share News

బాధితులకు న్యాయం చేయాలి

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:09 AM

పట్టణంలోని మిలిటరీ కాలనీలో చేనేతల స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, బాధితులకు న్యాయం చేయాలని వైసీపీ పార్లమెంట్‌ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక కోరారు.

బాధితులకు న్యాయం చేయాలి
మాట్లాడుతున్న బుట్టా రేణుక

ఎమ్మిగనూరు టౌన్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మిలిటరీ కాలనీలో చేనేతల స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, బాధితులకు న్యాయం చేయాలని వైసీపీ పార్లమెంట్‌ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక కోరారు. శనివారం స్థలం కబ్జాకు గురయిన బాధితులతో కలసి ఆమె మాట్లాడుతూ ఎమ్మిగనూరు అంటేనే చేనేతలు అలాంటి చేనేతల స్థలాలు కభ్జాకు గురవడం చాలా భాదాకరమన్నారు. కబ్జా దారులు, అధికారులతో కుమ్మక్కై అమాయకులైన పేదల భూములను రాత్రికి రాత్రి సర్వే నంబర్లు మార్చడం, బండలు పాతడం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అసలైన స్థల యజమానులు దానిని 1993లో కొన్నారని, అప్పట్లోనే అందులో బోరు వేసుకొని స్థలంపై వీఎల్‌టీ ట్యాక్స్‌ చెల్లిస్తున్నారని చెప్పారు. అయితే ఇప్పుడు అధికారులు వచ్చి సర్వే నంబర్‌ మారిందని, మీరు మార్చుకోవాలి అని చెప్పడం వెనుక ఉన్న మర్మమేమిటో అర్ధం కావడం లేదన్నారు. ఇలా అందరూ కబ్జాదారులకు సహకరిస్తున్నారన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 12:09 AM