పార్టీ కోసం కష్టపడే వారికి న్యాయం
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:54 PM
టీడీపీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అండగా ఉండి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షురాలు అధికాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ నియజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.
మంత్రాలయం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అండగా ఉండి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షురాలు అధికాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ నియజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు. మాధవరం గ్రామంలోని రాఘవేంద్రరెడ్డి నివాసంలో సోమవారం కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండేవిధంగా చూడాలని అన్నారు. మత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజా సమ్స్యల పరిష్కరిస్తూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూడాల్సిన భాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టించేందుకు చంద్రబాబు అహర్నిశలు కృషిచేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రఘునాథరెడ్డి, రామకృష్ణారెడ్డి, రాకేశ్‌రెడ్డి, రాజారెడ్డి, ఉరుకుందు, ఆలం బాషా, జ్ఞానేష్, ఈరన్న, మల్లికార్జున, బూదిరెడ్డి, జయరాముడు, వంశీ, టిప్పుసుల్తాన్, తోటయ్య తదితరులు పాల్గొన్నారు.