టీడీపీపై నమ్మకంతోనే చేరికలు: మంత్రి
ABN , Publish Date - Oct 22 , 2026 | 01:33 AM
టీడీపీపై నమ్మకంతోనే వివిధ పార్టీలకు చెందిన పలువురు టీడీపీలో చేరుతున్నారని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
నంద్యాల రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): టీడీపీపై నమ్మకంతోనే వివిధ పార్టీలకు చెందిన పలువురు టీడీపీలో చేరుతున్నారని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో 42 వార్డుకు చెందిన షేక్ మౌలాలి, షేక్ దాదావళి, 7, 14 వ వార్డుకు చెందిన ఖాజామొహిద్దీన్ ఆధ్వర్యంలో 300 మంది వైసీపీ నాయకులు మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి మంత్రి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు గమనిస్తున్నారన్నారు. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం, గౌరవం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, మదుసాయి, రంగయ్య పాల్గొన్నారు.