పోలింగ్ కేంద్రాల తనిఖీ
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:38 AM
ఆదోని వన్టౌన్ పరిధిలోని సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గురువారం ఏఎస్పీ జయశర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆదోని, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆదోని వన్టౌన్ పరిధిలోని సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గురువారం ఏఎస్పీ జయశర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉడేందుకు తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై ఆమె అధికారులతో చర్చించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని అధికారులను ఏఎస్పీ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఆదోని పోలీసు, రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నయూమ్అహమ్మద్, ట్రాఫిక్ సీఐ గౌస్, ఎస్ఐ రామ్నాథ్, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.