Share News

సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:00 AM

మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్‌సీ) జాతీయ ఆరోగ్య మిషన్‌ రాష్ట్ర బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది.

సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
సీహెచ్‌సీని తనిఖీ చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం బృందం

వెల్దుర్తి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్‌సీ) జాతీయ ఆరోగ్య మిషన్‌ రాష్ట్ర బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. జాయింట్‌ డైరెక్డర్‌ జె.నరసింహనాయక్‌ నేతృత్వంలోని ఈ బృందంలో పీవీ కిరణ్‌, ఎన్‌. రమేశ్‌, వి. సురేశ్‌ ఉన్నారు. వీరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాలు, వైద్యసేవల నాణ్యతను పరిశీలించారు. అత్యవసర విభాగం, ఆపరేషన్‌ థియేటర్‌, రోగుల వార్డు, ఫార్మసీ, ల్యాబ్‌ తదితర అన్ని విభాగాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్యసిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లకు తగిన సలహాలు, సూచనలు అందజేస్తూ.. వృత్తిపరమైన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఫార్మసీ, ల్యాబ్‌లలో కూడా పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి, వైద్యసేవలు ఏవిధంగా అందుతున్నాయని వాకబు చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ జఫ్రుల్లా, మెడికల్‌ ఆఫీసర్‌ బాలచంద్రారెడ్డి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2026 | 12:00 AM