Share News

వేరుశనగ విత్తనాల పంపిణీపై విచారణ

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:39 PM

రైతులకు ఉచితంగా అందజేసిన విశిష్ట వేరుశనగ విత్తనాల పంపిణీపై విజయవాడ కమిషనరేట్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ వినయ్‌చంద్‌, అదనపు అడిషనల్‌ డెరెక్టర్‌ మద్దిలేటి విచారణ చేశారు.

వేరుశనగ విత్తనాల పంపిణీపై విచారణ
ఏవోను విచారిస్తున్న అధికారులు

దేవనకొండ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఉచితంగా అందజేసిన విశిష్ట వేరుశనగ విత్తనాల పంపిణీపై విజయవాడ కమిషనరేట్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ వినయ్‌చంద్‌, అదనపు అడిషనల్‌ డెరెక్టర్‌ మద్దిలేటి విచారణ చేశారు. దేవనకొండ మండలంలో నేలతలమర్రి, గుండ్లకొండ, జిల్లెడుబుడకల గ్రామాలలో ఉచితంగా దాదాపు 174 మంది రైతులకు వేరుశనగ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. అనర్హులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు రావడంతో జిల్లా వ్యాప్తంగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. వేరునగ విత్తనాల ఏమి చేశారని అడగగా.. వర్షాభావ పరిస్థితుల వల్ల విత్తుకోలేదని రైతులు తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్‌ బాలజీనాయక్‌, ఏడీఏ రాజశేఖర్‌, ఏవో ఉషారాణి, ఏఈవోలు రంగన్న, మల్లికార్జున, తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 11:39 PM