Share News

వైసీపీ పాలనలో దళితులకు అన్యాయం

ABN , Publish Date - May 22 , 2026 | 12:13 AM

వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మిడుతూరులో డాక్టర్‌ సుధాకర్‌ సంస్మరణ దినం నిర్వహించారు.

వైసీపీ పాలనలో దళితులకు అన్యాయం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

మిడుతూరు, మే 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మిడుతూరులో డాక్టర్‌ సుధాకర్‌ సంస్మరణ దినం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎక్కువగా నష్టపోయింది దళితులే అని అన్నారు. కొవిడ్‌ సమయంలో ఓ వైద్యుడు మాస్కులు అడగడంతో ఆ డాక్టర్‌ దళితుడు అని చూడకుండా ఒక ఉన్మాదిగా, ఒక పిచ్చివాడిగా ముద్రవేసి గుండు కొట్టి అవమానించి మరణానికి కారకులయ్యారని అన్నారు. అనంతరం పీరుసాహహెబ్‌ పేట గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద బోయ రంగన్నకు రూ.40,599, వడ్డె రంగస్వామికి రూ.30,600, చంద్ర పుల్లారెడ్డికి రూ.25 వేలు, సాయిబాబాకు రూ.40,070, చిన్న ఎల్లన్నకు రూ.55,686 చెక్కులను అందజేశారు. టీడీపీ నందికొట్కూరు, మిడుతూరు మండలాల కన్వీనర్లు మాండ్ర సురేంద్రనాథ్‌ రెడ్డి, కాతా రమేశ్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2026 | 12:13 AM