సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:20 AM
రైతులు సమగ్ర సస్యరక్షణ పద్దతులను పాటిస్తే మేలైన పురుగుల మందుల అవశేషాలు లేని పంట దిగుబడిని తీయవచ్చునని తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉద్యవన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి, అన్నారు.
గోనెగండ్ల, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రైతులు సమగ్ర సస్యరక్షణ పద్దతులను పాటిస్తే మేలైన పురుగుల మందుల అవశేషాలు లేని పంట దిగుబడిని తీయవచ్చునని తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉద్యవన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి, అన్నారు. శుక్రవారం మండలంలోని కులుమాల గ్రామంలో తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు మిరప పంటలను పరిశీలించారు. అందులో బాగంగా గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస రెడ్డి పొలంలోని సాగు చేసిన మిరప పంటను పరిశీలించారు. రైతులతో సమావేశం నిర్వహించారు. అలాగే ఉల్లి పంటలను కూడా వారి పరిశీలించారు. ఉల్లిలో ఎత్తు మడులు, డ్రిప్ ఇరిగేషన్ పద్దతులు పాటించి నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చునని తెలిపారు. ఎమ్మిగనూరు ఉద్యనవన శాఖ అధికారి శ్రీవాణి, గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రకాష్, జగదీష్, నల్లారెడ్డి రైతు ఉత్పత్తి దారుల సంఘం చైర్మన్ వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.