Share News

ప్రమాద బీమా చెక్కు అందజేత

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:23 AM

విద్యుదాఘాతంతో మృతి చెందిన హార్వెస్టర్‌ డ్రైవర్‌ కుటంబానికి ఎమ్మెల్యే జయసూర్య రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేశారు.

 ప్రమాద బీమా చెక్కు అందజేత
డ్రైవర్‌ కుటుంబానికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే జయసూర్య

నందికొట్కూరు రూరల్‌/ జూపాడుబంగ్లా, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో మృతి చెందిన హార్వెస్టర్‌ డ్రైవర్‌ కుటంబానికి ఎమ్మెల్యే జయసూర్య రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేశారు. జూపాడుబంగ్లా మండలంలోని తూడిచర్ల గ్రామానికి చెందిన రంజిత్‌ అనే యువకుడు నాలుగు నెలల క్రితం హార్వేస్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ గోస్పాడు మండలంలో విద్యుదాఘాతంతో గురై మృతిచెందాడు. అప్పట్లో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, యాదవ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లుయాదవ్‌ మృతుని కుటుంబానికి ఆదుకోవాలని అప్పట్లో విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి సహకరించారు. చెక్కు మంజూరు కాగా.. బుధవారం అల్లూరులో ఎమ్మెల్యే తన కార్యాలయంలో అందజేశారు. టీడీపీ నాయకుడు మాండ్ర సురేంద్రనాథరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 12:24 AM