ఘనంగా ఆలయ వార్షికోత్సవం
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:07 AM
కౌతాళంలో పార్వతీదేవి సమేతంగా ఉన్న త్రయంబకేశ్వర స్వామి దేవాలయం 3వ వార్షికోత్సవాన్ని గురువారం గ్రామ ప్రజలు కనుల పండువగా చేసుకున్నారు.
కౌతాళం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): కౌతాళంలో పార్వతీదేవి సమేతంగా ఉన్న త్రయంబకేశ్వర స్వామి దేవాలయం 3వ వార్షికోత్సవాన్ని గురువారం గ్రామ ప్రజలు కనుల పండువగా చేసుకున్నారు. దేవాలయంలో వారం రోజులుగా రాత్రి సమయంలో వివిధ మఠాల పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు కొనసాగుతున్నాయి. గురువారం ఆలయం నుంచి శివుని విగ్రహంతో గ్రామ దేవత మారికాంబదేవి దేవాలయంకు చేరుకుని అక్కడ ఉన్న ఊరిబావి నుంచి మహిళలు శుద్ధ జలాలను ప్రత్యేక బిందెలలో తీసుకువచ్చి త్రయంబకేశ్వరునికి జలాభిషేకం చేసి ప్రత్యేక పుష్పాలతో ఆలంకరించారు. వందలాదిగా మహిళా భక్తులు శుద్ద జలాల బిందెలను కళశాలతో వస్తుండగా గ్రామస్థులు స్వాగతం పలికారు. సాయంత్రం ఆలయంలో ప్రత్యేక ప్రవచనాలు కొనసాగించాయి.