ఆలూరు అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:30 AM
ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం చేస్తోందని టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివ ప్రసాద్ అన్నారు.
హొళగుంద, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం చేస్తోందని టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివ ప్రసాద్ అన్నారు. హొళగుందలోని టీబీబీ గెస్ట్ హౌస్‌లో మండలంలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తాను ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు వ్యవధిలో ఆలూరు తాలూకాలో రూ. 22 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు, మురుగు కాలువలు, పంచాయితీ భవనాలు, దేవరగట్టుకు సీసీ రోడ్డు కోసం నిదులు సేకరించినట్లు తెలిపారు. ధనాపురం నుంచి హొళగుంద రోడ్డు నిర్మాణం కోసం రూ. 11 కోట్లు మంజూరు చేశారని అన్నారు. పార్టీ బలోపేతానికి టీడీపీ శ్రేణులు కృషి చచేయాలని కోరారు. టీడీపీ మండల కన్వీనర్ తిప్పయ్య, నాయకులు గోవింద్ గౌడ్, శేషగిరి, హెబ్బటం, విష్ణువర్ధన్ రెడ్డి, దుర్గయ్య, అబ్దుల్ సుభాన్ పాల్గొన్నారు.