Share News

బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:59 PM

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి అన్నారు.

 బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం
చెక్కులు అందుకున్న వారితో రాఘవేంద్ర రెడ్డి, నాయకులు

మంత్రాలయం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి అన్నారు. మాధవరంలోని తన నివాసంలో సోమవారం మంచాల కేడీసీసీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ రఘునాథ్‌రెడ్డి, నాయకుడు రాకేశ్‌ రెడ్డి, టీడీపీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి చావడి వెంకటేష్‌, మంత్రాలయం, కోసిగి, కౌతాళం టీడీపీ మండల అధ్యక్షులు ఎస్‌ఎం గోపాల్‌రెడ్డి, రామిరెడ్డి, మల్లికార్జున, ముత్తురెడ్డి, సతీష్‌కుమార్‌ నాయుడు, వెంకటపతిరాజు ఆధ్వర్యంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. నాలుగు మండలాల్లోని 81 మందికి మజూరైన రూ.43,96,022 చెక్కులను అందజేశారు. పెద్దకడబూరు మండలానికి 9 మందికి రూ.5,14,625, కౌతాళం మండలానికి 24 మందికి రూ.17,39,008, కోసిగి మండలానికి 38 మందికి గాను రూ.12,31,536, మంత్రాలయం మండలానికి 10 మందికి రూ. 9,05,452 చెక్కులను అందజేశారు. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 19 నెలల్లో 9 విడతల్లో 250 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.1,59,44,626 అందజేసినట్లు తెలిపారు. టీడీపీ నాయకులు బసలదొడ్డి ఈరన్న, ఏసేబు, డీసీ తిమ్మప్ప, మల్లికార్జున, అడివప్పగౌడు, నర్సిరెడ్డి, అయ్యన్న, ఉసేని, ఉరుకుందు, వంశీ, గోపాల్‌, రాగన్న, భీమిరెడ్డి, నాగరాజు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 11:59 PM