Share News

ఫ్రీజర్‌ బాక్స్‌ విరాళం

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:49 AM

పట్టణంలోని జవ్వాజి సుంకన్న గౌడ్‌ సేవా సమితికి దాతలు సూదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సూదిరెడ్డి రమేష్‌రెడ్డి, శ్రీకాంత్‌, ఆవుల శివశంకర్‌ కలిసి ఫ్రీజర్‌ బాక్స్‌ను విరాళంగా అందజేశారు.

 ఫ్రీజర్‌ బాక్స్‌ విరాళం
ఫ్రీజర్‌ బాక్సును అందజేస్తున్న దాతలు

నందికొట్కూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జవ్వాజి సుంకన్న గౌడ్‌ సేవా సమితికి దాతలు సూదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సూదిరెడ్డి రమేష్‌రెడ్డి, శ్రీకాంత్‌, ఆవుల శివశంకర్‌ కలిసి ఫ్రీజర్‌ బాక్స్‌ను విరాళంగా అందజేశారు. వారు మాట్లాడుతూ మృతి చెందిన వారి భౌతిక కాయాలను భద్రపరిచేందుకు అవసరమైన వారికి ఉచితంగా ఈ సేవలు అందించనున్నట్లు దాతలు తెలిపారు. ఈ సేవా సమితి వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమ వంతు సహాయంగా ఈ ఉచిత ఫ్రీజర్‌ బాక్స్‌ను అందజేసినట్లు వారు తెలిపారు.

Updated Date - Mar 29 , 2026 | 12:49 AM