ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:51 PM
రైతులు ప్రకృతి వ్యవ సాయంపై దృష్టి సారించాలని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ మాధురి సూచించారు.
వెల్దుర్తి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రైతులు ప్రకృతి వ్యవ సాయంపై దృష్టి సారించాలని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ మాధురి సూచించారు. కలగొట్ల గ్రామ రైతుసేవా కేంద్రంలో సోమవారం ప్రకృతి వ్యవసాయ రైతులకు పీజీఎస్ గ్రూపుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. గ్రూపులు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి?, ట్రైనింగ్ యాక్షన్ ప్లాన్, ఫీల్డు ఇంప్లిమెంటేషన్ పీర్ అప్రైజల్ ఏ విధంగా చేసుకుంటారు?, కౌలు రైతులకు పీజీఎస్ గ్రూపుల లో ఎలా ఎంటర్ చేస్తారు? వారికి ఉన్న అర్హతలు ఏమిటి?, గ్రూపులు ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయడానికి ఏవిధమైన సహాయ సహకారాలు తదితర వాటిపై సమావేశం నిర్వహించారు. జీవామృతం తయారు చేసే విధానం, ఉపయోగించే విధానం, కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించారు. కార్యక్రమంలో నీరజ, బిజయ్, లక్ష్మయ్య, హర్ష, సందీప్‌కుమార్, చంద్రకళ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.