బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:48 PM
విద్యుదాఘాతంతో గుడిసె దగ్ధం కావడంతో బాధితుడు నాగరాజుకు దేవనకొండ జడ్పీటీసీ షేక్ సాధిక రూ.50 వేల ఆర్థిక సాయం చేశారు.
దేవనకొండ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో గుడిసె దగ్ధం కావడంతో బాధితుడు నాగరాజుకు దేవనకొండ జడ్పీటీసీ షేక్ సాధిక రూ.50 వేల ఆర్థిక సాయం చేశారు. గురువారం ఉదయం బాధితుడు నాగరాజును పరామర్శించారు. టీడీపీ నాయకులు ఈదులదేవరబండ సుభాన్, బడిగింజల రంగన్న, ఎంపీటీసీ సభ్యులు ఆకుల వీరేశ్, వేణు, సదాశివ, యూసుప్, మధుసుదన, తదితరులు పాల్గొన్నారు. అలాగే జనసేన నాయకులు బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. నాయకులు ఉచ్చీరప్ప, రామాంజినేయులు, వీర మహిళ సరోజ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.