Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:47 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
తలముడిపిలో కరపత్రం పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

మిడుతూరు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మండలంలోని తలముడిపి గ్రామంలో మంగళవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయిన సందర్భంగా ఇంటింటకి వెళ్లి రైతెలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఎంపీడీవో దశరథరామయ్య, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఏడీఏ గిరీశ్‌, టీడీపీ మండల కన్వీనర్‌ కాతా రమేశ్‌ రెడ్డి, టీడీపీ నాయకులు శివరామి రెడ్డి, బాలనాగిరెడ్డి, రామస్వామి రెడ్డి, ఇబ్రహీం, గోపాల్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

మిడుతూరు జడ్పీ హైస్కూల్‌లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే జయసూర్య మంగళవారం పరిశీలించారు. ఎమ్మెల్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు తాగునీరు, మరుదొడ్లు, క్రీడా సామగ్రి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం, స్టూడెంట్‌ కిట్లు అందాయా? అని విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జూపాడుబంగ్లా: రాష్ట్రప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో అన్నదాత సుఖీభభ, పీఎం కిసాన్‌ డబ్బులు జమ చేసిందని ఏవో కృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని తాటిపాడు, 80బన్నూరు గ్రామాల్లో మంగళవారం ఇంటింటికి వెళ్లి రైతు కుటుంబాలకు కరపత్రాలు అందజేశారు. డబ్బులు అనవసర ఖర్చులు పెట్టకుండా రాబోయే ఖరీఫ్‌లో పెట్టుబడి ఖర్చులకు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఖాజీకురైషన్‌, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: అన్నదాత సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆత్మకూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ వంగాల కృష్ణారెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ షాబుద్దీన్‌ అన్నారు. కరివేన గ్రామంలో అన్నదాత సుఖీభవ మూడో విడత సహకారం పొందిన లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం రైతాంగ సమస్యలను గాలికి వదిలేసినట్లు చెప్పారు. అప్పట్లో రైతులకు రూ.13500 సాయం మాత్రమే అందించినట్లు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.20వేల సాయాన్ని అందిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు యుద్ధప్రాతిపదికన పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. అలాగే రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దినకర్‌, ప్రదీప్‌రావు, దావీద్‌, వ్యవసాయ శాఖ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:47 AM