రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:47 AM
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. సి.బెళగల్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఏవో మల్లేష్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు.
సి. బెళగల్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. సి.బెళగల్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఏవో మల్లేష్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద నియోజకవర్గ రైతులకు రూ.19.72 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా చెక్కును అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి 30ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, మళ్లీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారని అన్నారు. రోడ్లు, తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏడీ సాలురెడ్డి, మండల వ్యవసాయాధికారులు, టీడీపీ నాలుగు మండలాల కన్వీనర్లు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు హరి, సింగిల్ విండో ప్రెసిడెంట్ తిమ్మప్ప, మండల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.