రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:48 PM
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గిత్తా జయసూర్య అన్నారు.
నందికొట్కూరు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గిత్తా జయసూర్య అన్నారు. నందికొట్కూరులోని మార్కెట్ యార్డ్‌లో ఏపీ మార్క్‌ఫెడ్ డీసీసీ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం ద్వారా కనీస మద్దతు ధరపై ఎమ్మెల్యే.. కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మెన్ నాగేశ్వరయాదవ్‌తో కలసి కందులు కొనుగోలు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రైతుల కోసం రాయితీలో వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, మందులు, పెట్టుబడి సాయం ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. అనేక సంక్షేమాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, మార్కెట్‌యార్డ్ చైర్మన్ వీరం ప్రసాదరెడ్డి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరయాదవ్, మార్క్‌ఫెడ్ హరినాథరెడ్డి, గిరీశ్, సుధాకర్, రమేశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, లింగస్వామిగౌడ్, రబ్బాని, జాకీర్ హుస్సేన్, షాఖీర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.