Share News

నేత్ర దానం

ABN , Publish Date - May 22 , 2026 | 12:12 AM

నంద్యాల పట్టణంలోని స్టేట్‌ బ్యాంక్‌ కాలనీకి చెందిన నల్లగట్ల శ్రీరాములు గురువారం మరణించారు.

నేత్ర దానం
నేత్రదానం చేస్తున్న మృతుని కుటుంబ సభ్యులు

నంద్యాల టౌన్‌, మే 21(ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణంలోని స్టేట్‌ బ్యాంక్‌ కాలనీకి చెందిన నల్లగట్ల శ్రీరాములు గురువారం మరణించారు. మృతుడి కోరిక మేరకు అతని కుమారుడు నల్లగట్ల విజయకుమార్‌ స్పందించి నేత్రదానం చేయాలని సంకల్పించారు. ఈ విషయాన్ని రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ దస్తగిరికి తెలుపగా వారు కర్నూలు నుంచి టెక్నీషియన్స్‌ను పిలిపించి మృతుని రెండు నేత్రాలను సేకరించారు. ప్రతి ఒక్కరూ నల్లగట్ల శ్రీరాములును ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆర్గాన్‌ డొనేషన్‌ కో ఆర్డినేటర్‌ ఖండే ఆనంద్‌ గురూజీ పేర్కొన్నారు. తాను రెడ్‌క్రాస్‌ సొసైటీ కో ఆర్డినేటర్‌గా ఎన్నికైన సంవత్సర కాలంలోనే 25 మందితో నేత్రాలు సేకరించి ఎల్‌వీ ప్రసాద్‌ హాస్పిటల్‌కు పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మారుతికుమార్‌, రెడ్‌క్రాస్‌ టెక్నీషియన్లు ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2026 | 12:12 AM