షోరూమ్‌ల్లో విస్తృత తనిఖీలు
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:27 AM
డోన్ పట్టణంలోని పలు ద్విచక్ర వాహనాల షోరూమ్‌లను డోన్ ఆర్టీవో క్రాంతి కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డోన్ రూరల్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): డోన్ పట్టణంలోని పలు ద్విచక్ర వాహనాల షోరూమ్‌లను డోన్ ఆర్టీవో క్రాంతి కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కొంత మంది డీలర్లు, సబ్ డీలర్లు, ఆర్‌టీఏ ఫీజులు అని చెప్పి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ విష యంపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత నివేదికను జిల్లా రవాణా శాఖ అధికారికి పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.