ఎక్సైజ్ పోలీసు స్టేషన్ తనిఖీ
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:57 AM
పత్తికొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
పత్తికొండ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ సారా నియంత్ర ణకు సిబ్బంది పూర్తిస్థాయిలో పని చేయాలని, నిర్భయంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పత్తికొండ ఎక్సైజ్ సీఐ సువర్ణలత, సిబ్బంది ప్రవీణ్‌నాయక్, రాజేశ్ ఉన్నారు.