Share News

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:26 AM

డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి తెలిపారు.

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి
ఆలూరులో డ్రైనేజీని పరిశీలిస్తున్న వైకుంఠం జ్యోతి

ఆలూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి తెలిపారు. బుధవారం ఆమె ఎంపీడీవో కార్యాలయం ఎదుట నెలకొన్న డ్రైనేజీ కాలువను పరిశీలించారు. డ్రైనేజీలో మురుగునీరు నిలిచిపోవడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీనప్ప, నరసప్ప, షేక్ష పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 12:26 AM