Share News

పచ్చదనం పెంపునకు కృషి

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:34 AM

రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

పచ్చదనం పెంపునకు కృషి
మొక్క నాటుతున్న మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. శుక్రవారం తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంద న్నారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటితే భవిష్యత్తులో ఎంతో ఉప యోగం ఉంటుందన్నారు. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ వ్యాయామం తప్పకుండా చేయాలని సూచించారు.

Updated Date - Jun 06 , 2026 | 12:38 AM