Share News

వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:47 PM

నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ బలోపేతం చేసేందుకు నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు.

వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి
మాట్లాడుతున్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి

నందికొట్కూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ బలోపేతం చేసేందుకు నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. పట్టణంలో వైసీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ సుధీర్‌ ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గం వైసీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహిచారు.. ఈ సమావేశానికి ముఖ్య అతిఽథిగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పార్లమెంట్‌ పరిశీలకులు, ఎమ్మెల్సీ కల్పలత, నియోజకవర్గం పరిశీలకుడు బుడ్డా శేషిరెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా సకాలంలో నిర్ధేశించిన పనులను పూర్తి చేసి పనిచేసే నాయకులకు పార్టీలో సముచితస్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 11:47 PM