పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:20 AM
బీజేపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఎమ్మెల్యే పార్థసారథి కోరారు.
ఆదోని, జూలై 30 (ఆంధ్రజ్యోతి): బీజేపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఎమ్మెల్యే పార్థసారథి కోరారు. పట్టణంలోని దేవి గార్డెన్‌లో గురువారం పార్టీ ఆదోని నియోజకవర్గ స్థాయి సంస్థాగత సమావేశం నిర్వహించారు. రామకృష్ణ, ఎమ్మెల్యే పార్థసారథి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రతి కార్యకర్త చేతిలోనే ఉందని అన్నారు. ఆదోని గడ్డపై బీజేపీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పార్టీలో నాయకులు ఎవరైనా మారవచ్చు కానీ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి నిజమైన ప్రాణమని, ప్రతి బూత్‌లోనూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బూత్ లెవెల్ ఏజెంట్లు, ఎస్‌ఐఆర్ కో ఆర్డినేషన్ టీం సభ్యులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఓటరు జాబితాను పరిశీలించాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జి సంధిరెడ్డి శ్రీనివాసులు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, ఏపీ రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు విట్టా రమేష్, రమేష్‌యాదవ్ పాల్గొన్నారు.