Share News

వృద్ధుల సంక్షేమానికి కృషి చేయాలి

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:36 AM

వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి కోరారు.

వృద్ధుల సంక్షేమానికి కృషి చేయాలి
ప్రసంగిస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

కర్నూలు లీగల్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి కోరారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవాన్ని సోమవారం నగరంలోని బి.క్యాంపులో మన వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వృద్దుల పట్ల జరుగుతున్న వివక్ష, వేధింపులే కాకుండా శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంపై కూడా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో లీగల్‌ సర్వీసెస్‌ మెంబర్‌ రాయపాటి శ్రీనివాస్‌, న్యాయవాది పాపారావు, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురారి శంకరప్ప, భీమా ఎల్లగౌడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 12:36 AM