బనగానపల్లె అభివృద్ధికి కృషి
ABN , Publish Date - May 31 , 2026 | 12:37 AM
బనగానపల్లె నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు.
బనగానపల్లె, మే 30 (ఆంధ్రజ్యోతి): బనగానపల్లె నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు. మండలంలోని పసుపుల గ్రామంలో రూ.30లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.50.20 లక్షలతో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకును శనివారం మంత్రి ప్రారంభించారు. టీడీపీ నాయకులు షేక్షావళి, బాలనాయుడు, భూషన్న, శేఖన్న, శేఖరప్ప, బాస్కర్ నాయుడు, మధుసూధన్, పెద్దరామదాసు, శ్రీనివాసులు, నరసింహులు, సిద్దప్ప, కృష్ణానాయక్, సుబ్బరాయుడు, తదిరతుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం జలజీవన్ మిషన్ కింద రూ.530 కోట్లతో అవుకు రిజర్వాయర్ నుంచి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి నీటి యదూపాయం కల్పిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామం నడిమధ్యలో లో రూ4కోట్ల వ్యయంతో సీసీ రోడ్డును కూడా త్వరలోప్రారంభిస్తామన్నారు. త్వరలో ప్యాపిలినుంచి పసుపుల మీదుగా నాలుగులైన్ల రోడ్డు నిర్మిస్తామన్నారు. గ్రామంలో మద్దిలేటిస్వామి రోడ్డు, పసుపుల చెర్వుకు సాగునీరు అందించేదుకు ప్రయత్నిస్తామని, చిన్నమల్కాపురం రోడ్డుకు నిధులు మంజూరు చేసి రోడ్డు మంజూరు చేస్తామని, మద్దిలేటి స్వామి రోడ్డు వేయాలని గ్రామస్థులు కోరారు. ఆర్‌డబ్లుఎస్ డీఈ మధుసూదన్, ఏఈ సాయికృష్ణ, ఏఈ వెంకటరమణ, ఎంఈవో స్వరూప, మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి, క్లస్టర్ ఇంచార్జి అమరనాథరెడ్డి, యాగంటి ఆలయ చైర్మన్ మౌళీశ్వర్‌రెడ్డి, బత్తుల బాస్కర్‌రెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
నెల రోజుల్లో టంగుటూరు గ్రామంలోని ఎస్సీ కాలనీకి సీసీ రోడ్డు పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం మండలంలోని టంగుటూరు గ్రామంలో ఆయన పర్యటించారు. డ్రైనేజీ, రోడ్ల పరిస్థితులను పరిశీలించారు. ఎస్సీ కాలనీలో నెలరోజుల్లో ఆయా సీసీ రోడ్ల నిర్మాణం పనులు పూర్తి చేస్తామన్నారు. త మంత్రి వెంట టీడీపీ నాయకులు టంగుటూరు సొసైటీ చైర్మన్ లక్ష్మికాంతరెడ్డి. దనుంజయరెడ్డి, బాలవెంకటసుబ్బయ్య, శేషారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వెంకటస్వామిరెడ్డి, గోవర్దన్‌రెడ్డి ఏఈ వెంకటరమణ, ఎస్సీ కాలనీ ప్రజలలు పాల్గొన్నారు.